ఇంటిగ్రేటెడ్​ గురుకులాలకు మళ్లీ టెండర్లు

ఇంటిగ్రేటెడ్​ గురుకులాలకు మళ్లీ టెండర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ సోమవారం రెండో సారి టెండర్లను పిలిచింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు టెండర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. అదే రోజు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి, ఫైనాన్షియల్ బిడ్ ను ఈ నెల 24న ఓపెన్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.

 రాష్ట్రంలో తొలి దశలో వికారాబాద్ జిల్లా కొడంగల్, ఖమ్మం జిల్లా  మధిర, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి  టీఎస్ఈడబ్ల్యూఐడీసీ గత నెల 1న టెండర్లు పిలిచింది. ఈ మూడు గురుకులాలకు మూడు కంపెనీలు మాత్రమే సింగిల్ టెండర్లు దాఖలు చేశాయి. దీంతో వాటిని రద్దు చేసి మరో సారి టెండర్లు పిలిచారు.