జగిత్యాల జిల్లా ఆర్టీసీ డిపోలో సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో, కొత్త బస్టాండ్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ కార్గో సెంటర్ ను ఆయన సందర్శించారు. ఆర్టీసీలో ప్రయోగత్మకంగా అందుబాటులోకి తెచ్చిన కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కార్గోలో సేవలు అందిస్తున్న సిబ్బందిని సజ్జనార్ అభినందించారు. 

రానున్న రోజుల్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా వినూత్న కార్యక్రమాలను ఆర్టీసీలో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు, కండక్టర్స్ తో  మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు.