తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ.. 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే..!

తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ.. 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే..!

తిరుమలలోని విశాఖ శారదా పీఠానికి టీటీడీ షాక్‌ ఇచ్చింది. తిరుమలలో నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. విశాఖ శారదా పీఠానికి గత  ప్రభుత్వం తిరుమలలో కేటాయించిన స్థలంలో  భారీ భవనాన్ని నిర్మిస్తోంది. అయితే భవన నిర్మాణంలో ఆక్రమణలు జరిగాయని టీటీడీ ఆరోపిస్తున్నది. ప్రభుత్వం కేటాయించిన స్థలం కంటే మరి కొంత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం ఆక్రమణలను క్రమబద్ధీకరించింది. 

దీనిపై ప్రజాసంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తిరుమలను ప్రక్షాళన చేస్తామన్న ప్రభుత్వం ..టీటీడీ అధికారుల కమిటి ఇచ్చిన నివేదిక ఆధారంగా...  తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టిటిడి పాలక మండలి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఎస్టేట్‌ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని కోర్టు గుర్తించడంతోపాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం  టిటిడి కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో  15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్‌ విభాగం నోటీసులు జారీ చేసింది.