టీశాట్​లో టీటీఎం డిజిటల్ పాఠాలు

  • మహాత్మాగాంధీ యూనివర్సిటీతో త్వరలోనే టీశాట్​ ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్​మెంట్(టీటీఎం)​ కోర్సును మహాత్మాగాంధీ వర్సిటీతో కలిసి టీశాట్ డిజిటల్ రూపంలో అందించనుంది. అందుకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేందుకు టీశాట్, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు అంగీకారానికి వచ్చాయి. బుధవారం మహాత్మాగాంధీ వర్సిటీ వైస్ చాన్స్​లర్ ప్రొఫెసర్​అల్తాఫ్ హుస్సేన్ టీశాట్ ఆఫీసును సందర్శించారు. టీశాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి డిజిటల్ ఎడ్యుకేషన్ పై చర్చించారు. యూనివర్సిటీలతో డిజిటల్ ఎడ్యుకేషన్​ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.