లక్నో: ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో భార్య భర్తలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. లక్నోలోని కాకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలో ముషీర్ (50) అనే వ్యక్తి భార్య, పిల్లలతో నివాసం ఉంటున్నాడు
మంగళవారం అతని మ్యారేజ్డే కావడంతో బంధువులు వచ్చారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అందరూ భోజనాలు చేసిన తర్వాత ఇంట్లో టీవీ చూస్తుండగా ఈ ఘటన జరిగింది.