
కామారెడ్డిటౌన్, వెలుగు : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్) స్టేట్ ప్రెసిడెంట్ మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కామారెడ్డి జిల్లా మహాసభ కన్వీనర్ కృష్ణమాచారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిందని, అయినప్పటికీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు.
సమస్యలు పరిష్కరించే విషయంలో ఇంకా నిర్లక్ష్యం చేస్తే పోరాటం తప్పదన్నారు. అక్రిడేషన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. రాష్ర్టవ్యాఫ్తంగా ఫెడరేషన్‌కు జర్నలిస్టుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఒక వైపు యాజమాన్యాలు పట్టించుకోకపోగా మరో వైపు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు బండి విజయ్‌కుమార్, తాటికొండ కృష్ణ, సెక్రెటరీ గండ్ర నవీన్‌లు మాట్లాడుతూ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను విస్మరించాయన్నారు.
ఇండ్ల స్థలాలు రాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని, ఈ ప్రభుత్వమైనా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా ప్రవీణ్‌గౌడ్, సెక్రటరీగా కరుణాకర్, వైస్ ప్రెసిడెంట్లుగా జమాల్పూర్ లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, రాకేశ్, జాయింట్ సెక్రటరీలుగా సంజీవ్, లింగం, ట్రెజరర్‌గా పి.రాములు, కార్యవర్గ సభ్యులుగా స్వాతి, బల్వంత్‌రావు, రామ
ఎన్నికయ్యారు.