జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి : అయితబోయిన రాంబాబుగౌడ్,

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి : అయితబోయిన రాంబాబుగౌడ్,

సూర్యాపేట, వెలుగు : జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు అయితబోయిన రాంబాబుగౌడ్, కార్యదర్శి బుక్క రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 

కాంగ్రెస్​ప్రభుత్వంలోనైనా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులపై రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయని, దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసి వాదనలు వినిపించి అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పుల్లారావు, జిల్లా సహాయ కార్యదర్శి సైదులుగౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు లింగాల సాయి పాల్గొన్నారు.