
ఉప్పల్, వెలుగు: ఉప్పల్‌స్టేడియం వద్ద బ్లాక్‌లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న ఇద్దరిని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్రాయల్స్మ్యాచ్జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని చాలా మంది స్టేడియం వద్దకు వస్తున్నారు.
డిమాండ్‌ను క్యాష్చేసుకునేందుకు కొందరు బ్లాక్‌లో ఐపీఎల్టికెట్లు విక్రయిస్తున్నారు. శనివారం స్టేడియం వద్ద బ్లాక్టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్, సంపత్అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రాజస్థాన్మ్యాచ్కు చెందిన 4 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని ఉప్పల్పోలీసులకు అప్పగించారు. కేసు నమోదైంది.