వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

చేవెళ్ల, వెలుగు:   ఆటో డ్రైవర్ అతివేంగా  నడపటంతో ఎదురుగా వస్తున్న  బైక్​ను  ఢీకొనడంతో  ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ  ఘటన రంగారెడ్డి జిల్లా  మొయినాబాద్ పీఎస్​లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..  మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరుకు చెందిన అశోక్ లేల్యాండ్  ఆ గ్రామం నుంచి కూరగాయలు తీసుకుని మార్కెట్ కు వెళ్తుంది. 

 అదే గ్రామానికి చెందిన బక్క రాజు(35) బైక్​ పై హిమాయత్ నగర్ చౌరస్తా నుంచి చిలుకూరు కు వస్తున్నాడు. గ్రామానికి సమీపంలో మహిళా ప్రాంగణం వద్దకు రాగానే కూరగాయలతో ఉన్న వాహనం బైక్​ పై వస్తున్న వ్యక్తిని డీకొట్టింది. దీంతో   రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

రెండు బైకులు ఢీకొని  ఒకరు మృతి... 

షాబాద్ మండలంలోని బోడంపహాడ్ వద్ద  రెండు బైకులు ఢీకొని  ఒకరు చనిపోయారు.  గ్రామానికి చెందిన మొగిలిగిద్ద సుధాకర్, కొత్తపల్లి బాలయ్య ఇద్దరు కలిసి గురువారం బైకుపై అంతారం గేట్ నుంచి ఇంటికి వస్తున్నారు. ఇదే  గ్రామానికి చెందిన రజినీకాంత్ తన బైకుపై పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో..  రైతువేదిక సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. 

ఈ  ఘటనలో  సుధాకర్, రజనీకాంత్​ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని  షాద్​నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ  సుధాకర్ మృతిచెందాడు. మృతుడు పరిగి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా  పనిచేస్తున్నాడు.  కేసు నమోదు  దర్యాప్తు లో ఉంది.