వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌

వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌

జీడిమెట్ల, వెలుగు : ఓ వృద్ధురాలిని కిడ్నాప్‌‌‌‌ చేసి నగలు దోచుకున్న ఘటనలో దంపతులను పేట్‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. బోడుప్పల్‌‌‌‌ పీర్జాదిగూడ మాధురి కాలనీకి చెందిన దండుగల మల్లేశ్‌‌‌‌ (36), లక్ష్మి (35) భార్యాభర్తలు. ఇద్దరు దురలవాట్లకు బానిసలుగా మారి, ఈజీగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22న కుత్బుల్లాపూర్‌‌‌‌ జయరాంనగర్‌‌‌‌ కల్లు కాంపౌండ్‌‌‌‌ వద్ద కనిపించిన ఓ వృద్ధురాలిని బలవంతంగా తమ ఓమ్ని కారులో ఎక్కించుకున్నారు.

తర్వాత వృద్ధురాలి చెవిపోగులు, ముక్కు పుడకలు, వెండి పట్టీలు తీసుకొని ఆమెను జవహర్‌‌‌‌నగర్‌‌‌‌లోని నిర్మాణనుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పేట్‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌ పోలీసులు ఎంక్వైరీ చేసి బుధవారం మల్లేశ్‌‌‌‌, లక్ష్మిని అరెస్ట్‌‌‌‌ చేసి, వారి వద్ద నుంచి 1.4 గ్రాముల బంగారంతో పాటు, 13 తులాల వెండిని స్వాధీనం చేసుకొని, ఓమ్నీ కారును సీజ్‌‌‌‌ చేశారు.