జనగామ జిల్లా పెంబర్తిలో పోకిరీలు రెచ్చిపోయారు. బైక్ అడ్డంగా పెట్టారని మొదలైన వాగ్వాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, ఇటుకలు, రాళ్ళతో దాడులు చేసుకున్నారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే యువకులు కొట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది.
దాడుల్లో కొంతమంది యువకులకు గాయాలు కాగా.... ఓ యువకుడి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. యువకుల ఫిర్యాదుతో జనగామ పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. యువకుల దాడుల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.