
- హాజరైన బ్రిటన్ వర్సిటీల ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీలో యూకే ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఎస్‌ఆర్ఎం వర్సిటీ, అచీవర్స్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఈ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ఇందులో బ్రిటన్‌కు చెందిన వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, బర్మింగ్‌హమ్ సిటీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్, మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీల ప్రతినిధులు హాజరై విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
తమ వర్సిటీల్లో ఉండే సౌలతులు, స్కాలర్‌షిప్స్, అప్లికేషన్ ప్రాసెస్ తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలూమ్నీ యూనియన్ యూకే (ఎన్‌ఐఎస్ఏయూ యూకే) ఫౌండర్, చైర్‌పర్సన్ సనమ్ అరోరా పాల్గొని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావకాశాలు, కెరీర్‌పై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్ మాజీ మెంబర్ వీరేంద్ర శర్మ, ఎస్‌ఆర్ఎం వర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ హయ్యర్ స్టడీస్ డైరెక్టర్ లక్ష్మీ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు