అక్షర్ ధామ్ ఆలయంలో రిషి సునాక్ పూజలు.. హిందువుగా గర్విస్తున్నా..అలాగే ఉంటున్నా..

అక్షర్ ధామ్ ఆలయంలో  రిషి సునాక్ పూజలు.. హిందువుగా గర్విస్తున్నా..అలాగే ఉంటున్నా..

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీలోని అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. తన సతీమణి  అక్షతా మూర్తితో కలిసి సెప్టెంబర్ 10వ తేదీ ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దాదాపు గంటన్నర పాటు..ఆలయంలో గడిపారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 

హిందువుగా గర్విస్తున్నా...

తాను హిందువునని గర్విస్తున్నానని  బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. హిందుు వాతావరణంలో పెరిగానని... ఇప్పటికీ అలానే ఉన్నానని చెప్పారు. జీ20 సదస్సు కోసం భారత్ వచ్చినా తాను.. తన పర్యటనలో ఓ మందిరాన్ని దర్శించాలని అనుకున్నానన్నారు. ప్రస్తుతం అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని చెప్పారు. 

జీ20 సమావేశాలకు హాజరైన రిషి సునాక్‌..సెప్టెంబర్ 9వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య  స్వేచ్ఛా వాణిజ్యంలో మిగిలి ఉన్న విషయాలపై త్వరలో చర్చించి బ్రిటన్, భారత్ దేశాలకు ఉపయోగపడే విధంగా ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఒప్పంద ద్వారా ఆర్థిక, రక్షణ, సాంకేతిక, హరిత ఇంధనం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారం ఉండనుంది.