స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించిన టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కు ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖెలో ఫెదొరోవ్ థ్యాక్స్ చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
రష్యా దాడులతో ఉక్రెయిన్ వ్యవస్థలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ ప్రభుత్వం స్టార్ లింక్ సేవలు అందించాలని, అందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను పంపాలని ఎలన్ మస్క్ కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన మస్క్.. ఉక్రెయిన్ దేశంలో ఇంటర్నెట్ సేవలకు చేయూతనిచ్చారు. తమ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ లో వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన టెర్మినల్ పరికరాలను ఉక్రెయిన్ కు అందించారు.
మస్క్ పంపించిన శాటిలైట్ ఇంటర్నెట్ టెర్మినల్స్ తో కూడిన ట్రక్కు ఫొటోను ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖెలో ఫెదొరోవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కష్టకాలంలో ఆదుకున్నందుకు ఎలన్ మస్క్ కు ఫెదొరోవ్ కృతజ్ఞతలు తెలిపారు. మోస్ట్ వెల్కమ్ అంటూ మస్క్ ట్విట్టర్ లో బదులిచ్చారు.
Starlink — here. Thanks, @elonmusk pic.twitter.com/dZbaYqWYCf
— Mykhailo Fedorov (@FedorovMykhailo) February 28, 2022
మరిన్ని వార్తల కోసం..