అల్లు అర్జున్​ క్రేజ్​ను తట్టుకోలేక కుట్ర పన్నారు

అల్లు అర్జున్​ క్రేజ్​ను తట్టుకోలేక కుట్ర పన్నారు
  • అందులో భాగంగానే అరెస్ట్
  •  సింగర్​ కల్పన ఆరోపణ 

ఖైరతాబాద్, వెలుగు: అల్లు అర్జున్​ జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ఇమేజ్​క్రియేట్​చేసుకోవడంతో ఓర్వలేనివారు తొక్కిసలాట కేసులో కావాలనే కుట్రపన్ని పోలీస్​కేసుపెట్టించి అరెస్ట్​చేయించారని సింగర్​కల్పన ఆరోపించారు. శనివారం ఆమె సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. ‘అల్లు అర్జున్​ఏమైనా దొంగా..? బెడ్​రూమ్​లోకి పోలీసులు వెళ్లాల్సిన పనేముంది’ అని ప్రశ్నించారు. పోలీసులు పెట్టిన కేసుల సెక్షన్లు ఆయనకు వర్తించవన్నారు. ‘అనుకోని సంఘటన జరిగి రేవతి మృతి చెందింది.. 

ఆ తొక్కిసలాటలో కూడా కుట్ర ఉందేమో’ అని అనుమానం వ్యక్తం చేశారు. బందోబస్త్​కోసం పోలీసులను సంప్రదించలేదనడం నిజం కాదన్నారు. అరెస్ట్​వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. అల్లు అర్జున్​ ఎదుగుదలను చూసి గిట్టనివారు అక్కడ కావాలనే తొపులాట సృష్టించారేమో? దాని ఫలితంగా తొక్కిసలాట జరిగి ఉండచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు.