నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం బిరిశెట్టిగూడానికి చెందిన అవిభక్త కవలలు వీణవాణిల పుట్టిన రోజు వేడుకలు స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మారగాని మురళి, నాగలక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా, రెండో సంతానంగా వీణవాణిలు అవిభక్త కవలలు జన్మించారు.
పుట్టుకతో ఇద్దరు తలలు కలిసి జన్మించారు. 13 ఏండ్ల పాటు నీలోఫర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కొంతకాలం తర్వాత వీరిని హైదరాబాద్ శిశు విహార్ కు తరలించారు. ప్రస్తుతం శిశు విహార్ లో డిగ్రీ సీఏ చివరి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం వీణవాణిల 22వ జన్మదిన వేడుకలను సొంతం గ్రామంలో అట్టహాసంగా నిర్వహించారు.