
నల్లబెల్లి, వెలుగు: మొక్కజొన్న చేనుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన వరంగల్జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. దుగొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన రైతు ఇజ్జిగిరి సదయ్య 4 ఎకరాల్లో మొక్కజొన్న చేను వేశాడు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైందని బాధిత రైతు వాపోయాడు.
రూ. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్టు తెలిపాడు. కష్టమంతా బూడిడ పాలైందని బోరున విలపించాడు. నర్సంపేట ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా వచ్చి మంటలను ఆర్పుతున్నట్టు చెప్పాడు.