Union Budget 2024-25 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్

 Union Budget 2024-25 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్​  పార్లమెంట్​లో ఫుల్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో  2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు  వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు మోరార్జీ దేశాయ్ పది సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

 కేంద్ర బడ్జెట్ 2024-25

  • కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
  • మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
  • పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
  • ద్రవ్యలోటు 4.3 శాతం  అంచనా
  • అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు)(అంచనా)

 

స్టాక్ మార్కెట్లు భారీ నష్టం

  • కేంద్ర బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లు ఢమాల్
  •  500లకు పైగా పాయింట్లు సెన్సెక్స్, 150 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టి 
 

 పన్ను విధానంలో మార్పు

  • కొత్తట్యాక్స్  విధానంలో పన్ను,స్లాబ్ లు మార్పు
  •  కొత్త పన్ను విధానం కింద  స్టాండర్ట్ డిడక్షన్ 50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు
  • 3లక్షల వరకు పన్ను మినహాయింపు
  • 3లక్షల నుంచి రూ.7లక్షల వరకు 5 శాతం
  • 7లక్షల నుంచి 10క్షల వరకు 10 శాతం
  • 10లక్షల నుంచి రూ.12లక్షల వరకు 15 శాతం
  • రూ.12లక్షల నంచి 15 లక్షల 20 శాతం శాతం  
  • రూ.15 లక్షల పైన 30 శాతం
  •  బడ్జెట్ కేటాయింపులు ఇలా 

  • ఎన్‌పీఎస్‌ పథకంలో మార్పులు
  • మైనర్లూ చేరేందుకు అవకాశం
  • కస్టమ్ డ్యూటీ ఫ్రీగా మూడు రకాల ఔషధాలు
  •  తక్కువ ధరకు లభించనున్న మూడు రకాల ఔషధాలు
  •  ఆన్ లైన్ షాపింగ్ లో తగ్గనున్న ధరలు
  • ఐటీ ఫిల్లింగ్ గడవు దాటినా నేరం కాదు
  • మొబైల్ ఛార్జర్లు, పరికరాలపై 15 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • 20 రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు  
  •  బంగారం, వెండిలపై  6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • ప్లాస్టిక్ పై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  •  32.04 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
  • జీడీపీలో 4.9 శాతంగా ఉండనున్న ద్రవ్య లోటు
  • స్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
  • స్టాంప్‌ డ్యూటీని పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
  • మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్‌ డ్యూటీ తగ్గింపు
  • బీహార్ లో రోడ్ల నిర్మాణానికి 26 వేల కోట్లు కేటాయించిన కేంద్రం
  • గయ,బుద్ధగయాలో ప్రత్యేక కారిడార్
  • క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటు
  •  కోసీ నదుల అనుసంధానానికి 11000 వేల కోట్లు
  • రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు
  • బూముల పరిరక్షణకు డిజిటల్ భూ ఆధార్
  • మౌలిక సదుపాయాలకు ₹11.11 లక్షల కోట్లు
  • మౌలిక సదుపాయల కల్పనకు బడ్జెట్‌లో మరోసారి పెద్దపీట
  • బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు
  • జీడీపీలో 3.4 శాతానికి సమానం
  • అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు
  • మహిళా అభివృద్ధికి 10 లక్షల కోట్లు
  • 12 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు
  • 25 వేలకు గ్రామాలకు కొత్తరోడ్లు
  • అసోంలోప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం
  • బీహార్,ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు
  • ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలకు గురైన రాష్ట్రాలకు ప్రత్యేక పథకాలు
  • బీహార్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు
  • వరద నివారణకు బిహార్‌కు రూ.11వేల కోట్లు
  • 30 లక్ష్లకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో ప్రత్యేక చర్యలు
  •  కొత్తరియాక్టర్ల ఏర్పాటుకు చర్యలు
  •  ముద్ర రుణాలు 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు
  • పట్టణాల్లో గృహ నిర్మాణాలకు 10 లక్షలకోట్లు
  • బీహార్,ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు
  • బీహార్ కు ఎక్స్ ప్రెస్ వేలు, రహదారులు
  • ఉన్నత విద్య చదివే వారికి 10లక్షల రుణం
  • కోటిఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు
  • ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు
  • సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు
  •  గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు
  • 210 లక్షల మంది యువతకు లబ్ధి
  • ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి
  •  వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
  • వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
  •   దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
  • అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
  • మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌
  • ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి మా కట్టుబడి ఉంది
  •    ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం
  • అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు
  •  పోలవరానికి పెద్దపీట.. త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి
  • నిరుద్యోగుల కోసం మూడు పథకాలు
  •  ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు
  •   ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు
  •  సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు
  • గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు
  • 210 లక్షల మంది యువతకు లబ్ధి
  • ఏపీ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు

  •  ఎయిర్ పోర్టుల ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక తోడ్పాటు
  •  పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
  •  బీహార్ కోసం ప్రత్యేక నిధులు
  • విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు
  • వాటర్,పవర్,రైల్వే,రోడ్ల నిర్మాణంలో ఏపీకి అండగా ఉంటాం
  • అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు
  • ఏపీ అర్బన్ డెవ్ లప్  మెంట్ కు 1500ల కోట్లు
  • ఏపీ వెనుకబడిన ప్రాంతాల్లో ఆవాస్ యోజన ఇండ్లు
  •  ఏపీకి ప్రత్యేక నిధులు ఇస్తాం
  • 1000 ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు
  •  ప్రతి ఏటా లక్ష మందిక ివిద్యా రుణం
  •  మూడు శాతం వడ్డీతో విద్యా రుణం
  •  ఈ బడ్జెట్లో  వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నాం
  • విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ కారిడార్లు ఏర్పాటు
  • వ్యవసాయం,అనుబంద రంగాలకు 1.52 లక్షల కోట్లు 
  • విద్యా ,నైపుణ్యాభివృద్ధికి లక్షా 48 వేల కోట్లు

ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్

వికసిత్ భారత్ లక్ష్యంగా తొమ్మిది అంశాలపై ఫోకస్ :

1. వ్యవసాయం
2. ఎంప్లాయిమెంట్
3. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి 
4. ఉత్పత్తి, సర్వీసు రంగాలపై ఫోకస్
5. పట్టణాభివృద్ధి, స్మార్ట్ సిటీస్
6. ఇంధన రంగం
7. మౌలిక వసతుల కల్పన
8. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం
9. రాబోయే తరానికి తగ్గట్టు సంస్కరణలు

  • 2024-  25 కేంద్ర బడ్జెట్ 4 అంశాలపై దృష్టి పెట్టింది. 
  • 1. పేదలను పేదరికం నుంచి ధనవంతులను చేయటం
  • 2. ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టటం.
  • 3. రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటం.. పెట్టుబడి సాయంతోపాటు మద్దతు ధర కల్పించటం
  • 4. మహిళల రక్షణ, మహిళా సాధికారిత దిశగా అడుగులు
  • రైతులు, యువత లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. 
  • ఉద్యోగులు, యువతలో స్కిల్ డెవలప్ మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాం.
  • వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలే లక్ష్యం
  • ఉద్యోగాలు,స్కిల్,ఎస్ఎంఎస్ ఈలపై ఫోకస్ 
  • బడ్జెట్ లో రైతులు, యూత్ పై ఎక్కువ పోకస్ పెట్టాం
  • బడ్జెట్ లో  యూత్ కు 2 లక్షల కోట్లు కేటాయించాం
  • యువతకు 1.48 లక్షల యువతకు ఉద్యోగలిచ్చాం
  • 4 అంశాలపై బడ్జెట్ లో దృష్టి పెట్టాం
  • ప్రజల మద్దతును మర్చిపోలేం
  • మోదీ  నేతృత్వంలో చారిత్రాత్మక బడ్జెట్
  • మేము రైతులకు మద్దతు ధర పెంచాం
  • పీఎం అన్న యోజన పథకం ఐదేండ్లు పెంచాం

 

 

  • లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ కు చేరుకున్నారు
  •  
  • ప్రధాని మోదీ పార్లమెంట్ కు చేరుకున్నారు
  •  
  • బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది
  • కేంద్ర బడ్జెట్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.బడ్జెట్ ట్యాబ్లెట్ తో  నిర్మలాసీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్నారు. 
  • కాసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్ బయట ట్యాబ్ ను చూపెట్టారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలిశారు. 
  • నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి ఆమె పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అత్యధిక సార్లు ఆర్థిక క మంత్రిగా మాజీ మంత్రి మోరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తర్వాత యూపీఏ హయాంలో పి.చిదంబరం తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 

 

  • కేంద్రంలోని ఎన్డీయే సర్కార్​ కాసేపట్లో(జూలై23)  పార్లమెంట్​లో ఫుల్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11:04 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభలో బడ్జెట్​ స్పీచ్​ ప్రారంభించనున్నారు. 
  • రూరల్​, అర్బన్​ డెవలప్​మెంట్​, హౌసింగ్​, రక్షణ, రైల్వే తదితర రంగాలకు ఈ బడ్జెట్​లో టాప్​ ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఈసారి ట్యాక్స్​ రిలీఫ్​ ఉంటుందని ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు.
  • 2014 నుంచి రెండు దఫాలు బీజేపీకి కేంద్రంలో ఫుల్​ మెజార్టీ ఉండగా.. ఈసారి మాత్రం కూటమి భాగస్వామ్యంతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ తమ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్​ నుంచి భారీగా నిధులు రాబట్టుకోవాలని భావిస్తున్నాయి.