
గవర్నర్ తమిళి సై ప్రోటోకాల్ ఇష్యూస్ పై కేంద్ర హోంశాఖ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులకు త్వరలో నోటీసులిస్చే అవకాశముందంటున్నారు. ప్రోటోకాల్ ఇష్యూస్ పైనే ప్రధానంగా గవర్నర్ కేంద్రానికి కంప్లైంట్ చేసినట్టు సమాచారం. నిన్న ప్రధాని మోడీ, ఇవాళ హోంశాఖ అమిత్ షాతోనూ ...ప్రోటోకాల్ సమస్యలపైనే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోయినా, రిప్లైపై అసంత్రుప్తితో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
గవర్నర్ లేకుండానే బడ్జెట్ సెషన్, మేడారం జాతరలో గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, గవర్నర్ యాదాద్రి టూరులోనూ కనీసం ఇవో కూడా లేకపోవడం, రాజ్ భవన్ ఉగాది సంబురాలకు సీఎం, మంత్రులు, ఇతర అధికార ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం. నాగర్ కర్నూల్ అడవిబిడ్డల కార్యక్రమానికి కూడా ప్రోటోకాల్ పాటించకపోవడం...ఇలా ప్రభుత్వం కావాలనే గవర్నర్ ను అవమానిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.