
కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీలోని ఆదర్శనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతులమీదుగా సన్ రైజ్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సన్ రైజ్ హాస్పిటల్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతుందన్నారు. ఆధునిక వైద్య పరికరాలతో అత్యవసర సేవలతో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో సన్ రైజ్ హాస్పిటల్స్ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.