ఉగ్రదాడి పిరికిపంద చర్య : మంత్రి సంజయ్

ఉగ్రదాడి పిరికిపంద చర్య : మంత్రి సంజయ్
  • కేంద్ర మంత్రి సంజయ్ కామెంట్

హైదరాబాద్, వెలుగు: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యలో పర్యాటకులు చనిపోవడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు జరపడం పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉగ్రవాద చర్యలు తమ సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో, హోంమంత్రి అమిత్ షా దృఢమైన మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనిస్తూ ఉందని వివరించారు. ఈ దాడికి  తెగబడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.