గత దశాబ్ద కాలంలో భారత అణువిద్యుత్తు సామర్థ్యం రెట్టింపయ్యిందని, 4780 మెగావాట్ల నుంచి 8081 మెగావాట్లకు చేరిందని, 2031 నాటికి ఈ సామర్థ్యం మూడు రెట్లు పెరిగి 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, అంతరిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
ప్రస్తుతం తొమ్మిది అణు విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, అనేక ఇతర ప్రాజెక్టులు ప్రీ– ప్రాజెక్ట్ దశలో ఉన్నాయి. అణుశక్తి సామర్థ్యాన్ని విస్తరించడంలో భారత్ ముందు వరుసలో ఉంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రక్షణ రంగం తదితర వివిధ రంగాల్లో అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది.
భారతదేశంలో థోరియం నిల్వలు కేవలం 21 శాతం మాత్రమే ఉండటంతో భారత్ యురేనియంపై ఆధారపడటం తగ్గించి, భవానీ ప్రాజెక్టు ద్వారా థోరియం నిల్వలను అన్వేషిస్తోంది. దేశంలోని ఏడు న్యూక్లియర్ ప్లాంట్లలో 22 రియాక్టర్లు ఉన్నాయి. ఏటా అవి 6780 మెగావాట్ల అణువిద్యుత్తును
ఉత్పత్తి చేస్తున్నాయి.