యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హత్రాస్ లో బస్సును లోడర్ వాహనం ఢీకొట్టడంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును ఓవర్ టెక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో చిన్నపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదంపై స్పందించారు రాష్ట్రపతిద్రౌపది ముర్ము. హత్రాస్ రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని ట్వీట్ చేశారు. గాయపడ్డవాళ్లు త్వరగా కోలుకోవాలని కోరారు రాష్ట్రపతి.
రోడ్డుప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయాలైన వారికి రూ,50 వేలు ప్రకటించారు.
#WATCH | Hathras, UP: 12 died and 16 injured in a collision between a roadways bus and a loader vehicle.
— ANI (@ANI) September 6, 2024
Hathras DM, Ashish Kumar says, "It was a collision between a roadways bus and a loader vehicle. The accident happened due to the overtaking. We have been informed about 12… pic.twitter.com/XoSVdQiCS3