ట్యాక్స్ ఫ్రీ మూవీగా 'ది కేరళ స్టోరీ'.. ఎంపీ తర్వాత యూపీ కీలక నిర్ణయం

ట్యాక్స్ ఫ్రీ మూవీగా 'ది కేరళ స్టోరీ'.. ఎంపీ తర్వాత యూపీ కీలక నిర్ణయం

కాంట్రవర్శియల్ మూవీ 'ది కేరళ స్టోరీ' ( The Kerala Story) మూవీని  మధ్య ప్రదేశ్ తర్వాత ట్యాక్స్ ఫ్రీ మూవీగా ఉత్తర్ ప్రదశ్ ప్రభుత్వం నిర్ణయించింది. విమర్శకుల చేత కూడా ప్రశంసలు దక్కించుకుంటున్న ఈ సినిమా.. విడుదలైన తేదీ నుంచి భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తోంది. కేరళలోని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ మూవీ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలవడంతో ఇటీవలే తమిళనాడులోని మల్టీ ఫెక్స్ లలో ఈ చిత్ర ప్రదర్శనను రద్దు చేశారు. కొన్ని రోజుల క్రితమే మధ్య ప్రదేశ్ లో ట్యాక్స్ ఫ్రీ మూవీగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా యూపీ కూడా అదే బాటలో నడుస్తూ.. ది కేరళ స్టోరీ ఫిలింను పన్ను రహిత సినిమా జాబితాలో చేర్చింది.

ఈ సందర్భంగా 'ది కేరళ స్టోరీ' సినిమాను ఉత్తరప్రదేశ్‌లో పన్ను రహితంగా తీర్చిదిద్దుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు. దీంతో ఈ మూవీకి మధ్యప్రదేశ్‌ వలే యూపీలోనూ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ వసూలు చేయరన్నమాట. అంతే కాదు ఈ సినిమాను ఆయన కేబినేట్ మంత్రులతో పాటు ప్రత్యేక స్ర్కీనింగ్ లో వీక్షించే అవకాశం ఉన్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మే 8న ఈ మూవీని నిషేధిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. రాష్ట్రంలో  శాంతిభ‌ద్ర‌తల ప‌ర్య‌వేక్ష‌ణ‌, విద్వేష నేరాలు, హింస ప్ర‌జ్వ‌రిల్ల‌కుండా ఉండేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆమె ప్ర‌క‌టించారు.

మే 5న 'కేర‌ళ స్టోరీ' విడుద‌ల‌ైంది. త‌మిళ‌నాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిలిపియడంతో నిర్మాతలు కోర్టుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.'

https://twitter.com/myogiadityanath/status/1655779115381686273