ఈ ఏడాది 15,547 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు

ఈ ఏడాది 15,547 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు
  • రూ.223 లక్షల కోట్లకు చేరుకున్న విలువ

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి– నవంబర్ మధ్య  రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. యూపీఐ వాడకం వేగంగా పెరుగుతోందని,  యూఏఈ, సింగపూర్‌‌‌‌, భూటన్‌‌, నేపాల్‌‌, శ్రీలంక, ఫ్రాన్స్‌‌, మారిసష్‌‌ వంటి దేశాల్లో కూడా యూపీఐ నడుస్తోందని  ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన (ఎన్‌‌పీసీఐ)  యూపీఐ సర్వీస్‌‌లను  2016 లో తీసుకొచ్చింది.  

వివిధ బ్యాంకులను ఒక్కచోటికి తేవడంతో యూపీఐ ద్వారా  డబ్బులు పంపడం ఈజీగా మారింది. ఈ ఏడాది ఒక్క అక్టోబర్‌‌‌‌లోనే రూ.23.49 లక్షల కోట్ల విలువైన   1,658 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. కిందటేడాది అక్టోబర్‌‌‌‌లో జరిగిన 1,140 కోట్ల ట్రాన్సాక్షన్లతో పోలిస్తే 45 శాతం పెరిగాయి.