పచ్చని ప్రకృతి.. మధ్యలో పాల ధారల వలె దూకుతున్న నీరు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు రెండు కళ్లు చాలవు. ఈ ప్రకృతి అందాలను కన్నులారా వీక్షించాలంటే..తనివితీరా ఆస్వాదించాలంటే..రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం నర్మాలకు వెళ్లాల్సిందే.
ప్రకృతి అందాలకు నెలవు నర్మాల అప్పర్ మానేరు జలాశయం. భారీ వర్షాలు, వరదలతో ఈ రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. మత్తడి దుంకుతూ జలపాతాన్ని తలపిస్తోంది. దీంతో నర్మాలకు పర్యాటకులు క్యూ కట్టారు. అప్పర్ మానేరు జలసిరులను ఆస్వాదిస్తున్నారు.
Also Read : యూరప్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ
భారీ వర్షాలకు --నర్మల అప్పర్ మానేరు మత్తడి దుంకుతోంది. -- కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, మెదక్ కూడవెళ్లి వాగు నుండి అప్పర్ మానేరుకు భారీగా వరదనీరు వస్తోంది. ఫలితంగా ఎగువ మానేరు జలాశయం పొంగిపొర్లుతోంది. మొత్తం 31 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న మానేరు పూర్తిగా నిండి మత్తడి మీదుగా పరవళ్లు తొక్కుతోంది.
ALSO READ : ఆగి ఉన్న డీసీఎంని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి
నర్మల అప్పర్ మానేరు డ్యాం పొంగి పొర్లుతుండటంతో.. గంభీరావుపేట్, సిద్దిపేటల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అటు నర్మల నుంచి- దుబ్బాకల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం నర్మల గ్రామంలో మానేరు నదిపై నిర్మించబడిన జలాశయం.ఈ రిజర్వాయర్ ద్వారా 1,62,000 హెక్టార్లకు సాగు నీరు అందుతోంది. అంతేకాకుండా జలాశయం ద్వారా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలు అందుతోంది.
Upper Manair Reservoir pic.twitter.com/2vwnA37yek
— Muskmelon (@gova3555) September 6, 2023
ఎలా చేరుకోవాలి..
నర్మాల అప్పర్ మానేరు డ్యాం హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ డ్యాం కేవలం 136 కిలో మీటర్లు మాత్రమే. హైదరాబాద్ నుంచి మూడున్నర గంటల్లో ఈ రిజర్వాయర్ కు చేరుకోవచ్చు. NH 44 మీదుగా వెళ్లాలి. రామాయంపేట దాటిన తర్వాత బిక్నూర్ నుంచి లింగుపల్లి, ఎల్పుగొండ, మాచారెడ్డి మీదుగా నర్మాల అప్పర్ మానేరు జలాశయంకు చేరుకోవచ్చు.