ఈదురుగాలులకు నేలకొరిగిన వరిపైర్లు

ఈదురుగాలులకు నేలకొరిగిన వరిపైర్లు

లింగంపేట, వెలుగు: ఈదురుగాలులకు లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. పోల్కంపేట, కన్నాపూర్‌‌‌‌ గ్రామాల్లో వరి పైర్లు కోత దశకు చేరుకోగా.. శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు పంటలకు నష్టం జరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 80 ఎకరాల్లో పంట నేలకొరిగింది. సర్కార్​ పరిహారం అందించి ఆదుకోవాలనీ రెండు గ్రామాల రైతులు కోరుతున్నారు.