యెమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేపిటల్ సిటీలో అమెరికా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రైక్స్‌‌‌‌‌‌‌‌ .. ముగ్గురు హౌతీ తిరుగుబాటుదారులు మృతి

యెమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేపిటల్ సిటీలో అమెరికా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రైక్స్‌‌‌‌‌‌‌‌ .. ముగ్గురు హౌతీ తిరుగుబాటుదారులు మృతి

దుబాయ్: యెమెన్​లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్​గా అమెరికా దాడులు చేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయందాకా అమెరికా యుద్ధ విమానాలు యెమెన్‌‌‌‌‌‌‌‌ రాజధాని సనా శివార్లలో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రైక్స్ చేశాయి. దీంతో ముగ్గురు హౌతీ తిరుగుబాటుదారులు చనిపోయారు. ఇంకో 12 మంది గాయపడ్డారని హౌతీలు మీడియాకు వెల్లడించారు. మార్చి 15 నుంచి అమెరికా దాడులు మొదలుకాగా, సోమవారం జరిగిన దాడి తీవ్రత మరింత ఎక్కువగా ఉందని అక్కడి మీడియా వెల్లడించింది. 

యెమెన్‌‌‌‌‌‌‌‌లోని సనా, హజ్జా గవర్నేట్ ప్రాంతాల్లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రైక్స్ జరిగాయని తెలిపాయి. హజ్జాలోని ఓ పికప్ ట్రక్‌‌‌‌‌‌‌‌పై మిసైల్‌‌‌‌‌‌‌‌ దాడి జరగ్గా ఇద్దరు, సనాలోని హౌతీలున్న ప్రాంతంలో మరో మైసైల్ దాడిలో ఒకరు చనిపోయినట్లు వెల్లడించాయి. అమెరికా ప్రెసిడెంట్​గా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటినుంచి హౌతీ తిరుగుబాటుదారులపై దాడులు మరింత తీవ్రం చేశారు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 61 మంది హౌతీలు చనిపోయారు.