అమెరికాలో భారతీయులకు అద్భుత విద్యావకాశాలు

అమెరికాలో భారతీయులకు అద్భుత విద్యావకాశాలు

హసన్ పర్తి, వెలుగు: అమెరికాలో భారతీయులకు ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయని యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్పిఫర్ లార్సన్ అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాల్లో అమెరికాలో ఉన్నత విద్యావకాశాలపై సమావేశం నిర్వహించారు. 

సమావేశానికి కేయూ వైస్ చాన్స్​లర్ ప్రతాప్ రెడ్డి, యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హాజరై మాట్లాడుతూ అమెరికాలో 4000 గుర్తింపు పొందిన యూనివర్సిటీలున్నాయన్నారు. భారతీయ విద్యార్థులకు పబ్లిక్, ప్రైవేటు యూనివర్సిటీలు స్వాగతం పలుకుతున్నాయన్నారు. నైపుణ్యాలతో కూడిన ఉన్నతవిద్యను అమెరికా అందిస్తుందన్నారు. సమావేశంలో కేయూ రిజిస్ర్టార్ రామచంద్రం, ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ మల్లారెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.