అంచనాలకు అనుగుణంగా యూఎస్ ఇన్‌‌‌‌ఫ్లేషన్

న్యూఢిల్లీ: యూఎస్‌‌‌‌లో ఇన్‌‌‌‌ఫ్లేషన్ (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్‌‌‌‌)  కిందటి నెలలో అంచనాలకు అనుగుణంగా నమోదైంది. నెల ప్రాతిపదికన నవంబర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 0.4 శాతం పెరగగా, ఏడాది ప్రాతిపదికన 2.9 శాతానికి చేరుకుంది. ఇన్‌‌‌‌ఫ్లేషన్   2.9 శాతంగా రికార్డ్ అవుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. 

ఫుడ్, ఇంధన ధరలను మినహాయిస్తే కోర్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లేషన్  డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో  నెల ప్రాతిపదికన 0.2 శాతం పెరగగా, ఏడాది ప్రాతిపదికన ‌‌‌‌3.2 శాతానికి  పెరిగింది. 3.3 శాతంగా నమోదవుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఇన్‌‌‌‌ఫ్లేషన్ అంచనాలకు అనుగుణంగా ఉండడంతో యూఎస్ మార్కెట్‌‌‌‌లు బుధవారం లాభాల్లో కదిలాయి. ఫెడ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గిస్తుందని  50 శాతానికి పైగా ఎనలిస్టులు భావిస్తున్నారు.