టెర్రరిస్టుల ఏరివేతలో భారత్‌‌కు సహకరిస్తం .. మోదీకి తులసి గబ్బర్డ్ లేఖ

టెర్రరిస్టుల ఏరివేతలో భారత్‌‌కు సహకరిస్తం .. మోదీకి  తులసి గబ్బర్డ్ లేఖ

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్(స్పై చీఫ్) తులసి గబ్బర్డ్ ఖండించారు. ఈ ఘటనను "ఇస్లామిస్ట్ ఉగ్రదాడి"గా పేర్కొంటూ.. దోషులను గుర్తించి శిక్షించడంలో భారత్‌‌కు తాము పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లెటర్ రాశారు. "పహల్గాం అటాక్​ను  మానవత్వంపై జరిగిన దాడిగా భావిస్తున్నం. ఈ దుశ్చర్యలో పాల్గొన్న టెర్రరిస్టులను గుర్తించి, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చేయడంలో అమెరికా భారత్‌‌కు సహకరిస్తుంది. 

ఈ దాడి.. కాశ్మీర్ లోయలోని జనాభా సంఖ్యలో మార్పులను నిరోధించే కుట్రలో భాగమే" అని తులసి గబ్బర్డ్ తన లేఖలో పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి విషయంలో భారత ప్రజలకు తన సంఘీభావం తెలియజేస్తున్నాని వెల్లడించిన ఆమె.. టెర్రరిస్టుల ఏరివేతలో భారత్‌‌కు అమెరికా సంపూర్ణ మద్దతు అందిస్తుందన్నారు. ఈ లేఖ.. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్-, అమెరికా మధ్య  సహకారం మరింత బలోపేతమవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.