
- అక్రమంగా మానవ శరీర భాగాలను అమ్మిన కేసులో శిక్ష
వాషింగ్టన్: మార్చురీ నుంచి మానవ శరీర భాగాలను దొంగిలించి విక్రయిస్తున్న మహిళకు అమెరికాలోని ఓ కోర్టు 15 ఏండ్ల జైలు శిక్ష విధించింది. కాండస్ చాప్‌మన్ స్కాట్(37) అనే మహిళ అర్కాన్సాస్ రాష్ట్రంలోని అర్కాన్సాస్ వర్సిటీ ఫర్ మెడికల్ సైన్సెస్‌లో ఉన్న మార్చురీలో పనిచేస్తున్నది. కాలేజీకి డొనేట్ చేసిన డెడ్‌బాడీల నుంచి శరీర భాగాలను తీసి విక్రయించింది. విషయం బయటకు రావడంతో ఆమెపై కేసు నమోదు చేయగా, కోర్టు విచారించి జైలు శిక్ష విధించింది.