- ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పెట్రోల్ బంకులు, షాపుల్లోని వెయింగ్ మెషీన్లను ట్యాంపరింగ్ చేసి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లయ్స్ మినిస్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సెక్రటేరియెట్లో వెయిట్స్ అండ్ మెజర్ మెంట్స్ డిపార్ట్ మెంట్ అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తూనికలు, కొలతల పరికరాల్లో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తెలిపారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ తో వినియోగదారులు మోసపోకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. వెయింగ్ మెషీన్లు సెట్టింగ్ చేసి అక్రమాలకు పాల్పడకుండా అధికారులు నిఘా పెంచాలని ఆదేశించారు.