- కొనసాగుతున్న వాగ్గేయకారోత్సవాలు
భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి మూలవరులకు ఆదివారం పంచామృతాలతో అభిషేకం జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చాక స్వామికి అభిషేకం, తిరుమంజనం చేశారు. అనంతరం భక్తులకుమంజీరాలు పంపిణీ చేశారు. బంగారు పుష్పాలతో అర్చన జరిగాక ప్రత్యేక హారతులు సమర్పించారు. కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం జరగ్గా 83 మంది భక్తులు కంకణాలు ధరించి క్రతువును జరిపారు.
సాయంత్రం దర్బారు సేవ జరిగింది. కాగా చిత్రకూట మండపంలో వాగ్గేయకారోత్సవాలు కొనసాగుతున్నాయి. డా.చింతలపాటి మంజుల, చివుకుల మాధవి, బూర్లగడ్డ రవికిరణ్, ఎండీ లాయక్ అహ్మద్, వాసా పావని, అభిషేక్ సూత్రపు బృందాలు రామదాసు, అన్నమయ్య, త్యాగయ్యల కీర్తనలతో వాగ్గేయకారులకు సంగీతాభిషేకం చేశారు.
అన్నదానం కోసం రూ.2లక్షల విరాళం
సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి ఆదివారం విశాఖపట్టణం చిట్టివలస గ్రామానికి చెందిన పోరం రామారావు పట్నాయక్, సరోజినీ దంపతులు రూ.2లక్షల విరాళాన్ని అందజేశారు. ఈవో రమాదేవి చేత స్వామికి ఇచ్చారు.