మహిళలను వ్యాపారవేత్తలుగా మారుస్తాం : రాందాస్ నాయక్

  • ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 

కారేపల్లి, వెలుగు: మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసిందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. కారేపల్లి మండలంలో తొడితెలగూడెం, కారేపల్లి గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి యూనిట్లను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్​లో మహిళా సాధికారితకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని తెలిపారు. 

స్వయం సహాయక సంఘాలు ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కల్పించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీవో సురేందర్, ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు తలారి చంద్రప్రకాశ్, పగడాల మంజుల, భానోత్ రామ్మూర్తి, బానోతు దేవుల నాయక్, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి టోని, అడ్డగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.