MATKA OTT: అఫీషియల్.. ఓటీటీలోకి వరుణ్‌తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

MATKA OTT: అఫీషియల్.. ఓటీటీలోకి వరుణ్‌తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వరుణ్ తేజ్ (Varun Tej) మట్కా (MATKA) మూవీ నవంబర్ 14 న థియేటర్లలో రిలీజై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్ (Karuna Kumar) మట్కాని రూపొందించారు. కమర్షియల్గా ఈ మూవీ నిర్మతలకి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. దీంతో మట్కా నెల తిరగకముందే ఓటీటీకి వచ్చేసింది.

మట్కా ఓటీటీ::

మట్కా సినిమా నేడు (డిసెంబర్ 5) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు మట్కా మూవీ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీ్ట్ చేసింది.

వరుణ్ తేజ్ మూడు కోణాల్లో సాగే పాత్రలో ఆకట్టుకున్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకుల ఆదరణను సంపాదించలేకపోయింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘మట్కా’ ఇంచుమించు రూ.3 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

మట్కా స్టోరీ::

మ‌ట్కా మూవీలో మ‌ట్కా వాసుగా మూడు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌రుణ్‌తేజ్ నటించాడు. 1958 నుంచి 1982 మధ్య కాలంలో నడిచే స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. వాసు (వరుణ్ తేజ్) అనే వ్యక్తి బ‌ర్మా నుంచి వైజాగ్‌కు బ‌తుకుతెరువు కోసం వ‌చ్చిన ఓ అతను మ‌ట్కా కింగ్‌గా ఎలా అయ్యాడు? ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నెలకొల్పాడు. ఈ జ‌ర్నీలో అత‌డి సాగించిన పోరాటంతో ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, ల‌వ్ స్టోరీ.. ఇలా ప్రతిదీ ఏంటనేది స్టోరీ.