జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు హీరో వరుణ్ తేజ్. ఆలయ అధికారులు, అర్చకులు వరుణ్ తేజ్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు వరుణ్ తేజ్. దర్శనానంతరం శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు.
కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను అంతరాలయ విగ్రహ విశిష్టతను వరుణ్ తేజ్ కు వివరించారు ఆలయ అర్చక బృందం. ఈ సందర్భంగా మాట్లాడిన వరుణ్ తేజ్.. కొండగట్టు అంజన్న చాలా పవర్ ఫుల్ దేవుడన్నారు. మొదటి సారి హనుమాన్ దీక్ష తీసుకున్నా.. అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు వరుణ్ తేజ్.
కొత్త మూవీకి వరుణ్ గ్రీన్ సిగ్నల్
రిజల్ట్ ఎలా ఉన్నా తను మాత్రం డిఫరెంట్ స్క్రిప్ట్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. మరోసారి కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నాయి.
Also Read : మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు
ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది . మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇండో కొరియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం వరుణ్ తేజ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇందులో తను ఫ్రెష్ అండ్ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడని టీమ్ చెప్పింది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.