బెదిరింపులకు భయపడేది లేదు.. బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట, వెలుగు:  బీఆర్ఎస్ లీడర్ల బెదిరింపులకు భయపడేది లేదని, వారి అరాచకాలకు చరమగీతం పాడాలని సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి  జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం భజన తండాకు చెందిన భూక్య నాగు నాయక్ ఆధ్వర్యంలో 200 మంది, బాలేంల గ్రామానికి చెందిన పల్సనరేశ్ గౌడ్ ఆధ్వర్యంలో 300 మంది ఆయన సమక్షంలో బీఎస్పీలో చేరారు.  

అనంతరం బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. బీఆర్‌‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు మద్యం, మనీతో ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై  బహుజన రాజ్య సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు రవీంద్ర నాయక్, వల్లాల బుచ్చయ్య, జానకి రాములు, సుమన్, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.