- 0009కు రూ. పదిన్నర లక్షలు
- ఫ్యాన్సీ నంబర్ల వేలంతో ఆర్టీఏకు రూ.52.52 లక్షల ఆదాయం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వాహన దారులు వెనుకాడడం లేదు. మంగళవారం ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ ఆఫీస్‌లో నిర్వహించిన ఫ్యాన్నీ నెంబర్ల వేలంలో నచ్చిన నంబర్ల కోసం తీవ్రంగా పోటీపడ్డారు. దీంతో ఆర్టీఏకు రూ.52,52,283 ఆదాయం సమకూరిందని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్రమేశ్కుమార్వెల్లడించారు.
వేలంలో టీజీ 09డి 0001 నంబర్‌ను రుద్రరాజు రాజీవ్ కుమార్ రూ.11,11,111కు దక్కించుకున్నారు. అలాగే టీజీ 09డి 0009 నంబర్‌ను మెగా ఇంజనీరింగ్అండ్ఇన్ఫ్రాస్ట్రక్చర్లిమిటెడ్ కంపెనీ రూ.10,40,000కు సొంతం చేసుకుంది. ఇక టీజీ 09సీ 9999 నంబర్‌ను శ్రియాన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ రూ.7,19,999కు దక్కించుకుంది. ఇక టీజీ 09డీ 0006 నంబర్‌ను పోరస్ ఆగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.3,65,000, వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ఎల్ఎల్ పీ సంస్థ టీజీ 09డీ 0005 నంబర్‌ను రూ. రూ.3,45,000లకు సొంతం చేసుకున్నాయి.
టీజీ 09డీ 0007 నంబర్‌ను ఎన్స్పిరామేనేజ్మెంట్సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.2,06,569లకు దక్కించుకుంది. టీజీ 09డీ 0019 నంబర్‌ను నంబర్‌మాల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,95,009కు సొంతం చేసుకుంది.