రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

 రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు: వరుసగా సెలవులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. బ్రేక్ దర్శనం క్యూలైన్లలోనూ భక్తులు భారీగా ఉన్నారు. స్వామి వారికి ఎంతో ఇష్టమైన కోడె మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు బారులుదీరారు. 

రాజన్న సేవలో హైకోర్టు జడ్జీలు 

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్నను సోమవారం తెలంగాణ, రాజస్థాన్, ఏపీ రాష్ట్రాల హైకోర్టు జడ్జీలు ఎన్.తుకరాంజీ, ఎం.లక్ష్మణ్, ఎ.హరిహర నందశర్మ దర్శించుకున్నారు.  ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రొటోకాల్​ఆఫీసర్లు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనంతరం స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కు చెల్లించారు.  కల్యాణ మండపంలో ఈవో కె.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి జడ్జిలకు శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట సిరిసిల్ల జిల్లా జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, తహసీల్దార్​విజయ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ప్రొటోకాల్ ఏఈవో అశోక్ కుమార్, పర్యవేక్షకుడు శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్యులు, సిబ్బంది 
ఉన్నారు.