పెనుబల్లి, వెలుగు : బ్రాయిలర్ కోళ్లకు వచ్చిన వైరస్ ను కంట్రోల్ చేయడానికి రెస్క్యూ చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనారాయణ తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రెండు రోజులుగా కోళ్లఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంపై మంగళవారం వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ టీమ్ కోళ్లఫారాలను సందర్శించి శాంపిల్స్ ను సేకరించింది. ఈ సందర్భంగా జేడీ వెంకటనారాయణ మాట్లాడుతూ మూడు, నాలుగురోజుల్లో వైరస్ గుర్తించనున్నామన్నారు.
ఈ వైరస్ఒక కోళ్లఫారం నుంచి మరొక కోళ్ల ఫారానికి దాణా వెహికల్స్, మనుషుల వల్ల సోకి ఉండొచ్చని తెలిపారు. వైరస్ విస్తరించకుండా వెటర్నరీ సిబ్బందితో రెస్క్యూ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీబీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్లు విజయభాస్కర్‌రెడ్డి, శిరీష, జిల్లా అడిషనల్ డైరెక్టర్లు ప్రదీప్‌కుమార్, అరుణ, మండల వెటర్నరీ డాక్టర్ సృజన పాల్గొన్నారు.