IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!

IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలు ప్రొడక్షన్ హౌస్‌లపై ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ రెయిడ్స్ (IT Raids) కంటిన్యూ అవుతున్నాయి. నిర్మాత దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా డైరెక్టర్ సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఈ క్రమంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్లో హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్నారు. నేడు (జనవరి 23న) నిర్వహించిన ఈ సక్సెస్ మీట్లో టాలీవుడ్ నిర్మాతలపై జరిపే సోదాలపై హీరో వెంకటేష్కు ప్రశ్న ఎదురవ్వగా స్పందించాడు. 'దిల్ రాజు నివాసంపై ఐటీ సోదాలు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదని.. నేను నా పారితోషికం మొత్తం వైట్‌లో తీసుకుంటానని చెప్పారు. నేను వైట్‌లో వైట్‌. అయినా నేను తీసుకునే రెమ్యునరేషన్‌ కూడా తక్కువే కదా!' వెంకటేష్ చెప్పారు.

దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ పెట్టాం కదా.. అందుకే  ఐటీ అధికారులు కూడా సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యారేమో అని చెప్పారు. అలాగే దిల్‌ రాజు బాధలో ఉంటే, మీరు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీడియా ప్రశ్నించింది. అనిల్ చెబుతూ..' ఈ తనిఖీలపై దిల్ రాజు బాధలో లేరు. ఎందుకంటే, ఆయన ఒక్కడిపైనే రైడ్స్ జరగడం లేదు కదా.. ఇండస్ట్రీలోని చాలా మందిపై ఐటీ రైడ్స్‌ జరుగుతున్నాయి. ఇదంతా ఎప్పుడు జరిగే ప్రక్రియ మాత్రమే అని అనిల్ అన్నాడు.

ALSO READ | హైదరాబాద్లో మూడో రోజు కొనసాగుతోన్న ఐటీ రైడ్స్

అయితే, ఇండస్ట్రీ, బిజినెస్‌ వాళ్లపై ఇలా జరగడం సర్వసాధారణం. 'నేను వచ్చినా రాకపోయినా.. ఈ సినిమా ప్రమోషన్‌ను ఆపొద్దు. ఈ విజయాన్ని మీరు ప్రేక్షకులతో పంచుకోండని' దిల్‌ రాజు మాతో చెప్పారని అనిల్ తెలిపాడు. 

ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ గత సినిమాల రికార్డులను తిరగరాస్తోంది. ఈ మూవీ ఇప్పటికీ రూ.230కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గతంలో రూ.180 కోట్ల వసూళ్లతో అలవైకుంఠపురంలో మూవీ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తోనే బ్రేక్ చేసింది. అయితే, సంక్రాంతికి వస్తున్నాం మూవీ లాంగ్ రన్ లో రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.