
- తెలంగాణ వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ బాలస్వామి డిమాండ్
బషీర్‌బాగ్, వెలుగు: బెంగాల్లో రాక్షసి పాలనను అంతంచేసి రాష్ట్రపతి పాలన విధించాలని తెలం గాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. బెంగాల్లో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. హిందువులే లక్ష్యంగా జిహాదీలు కొనసాగిస్తున్న హింసను అరికట్టాలన్నారు. ఆ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న మారణకాండను నిలువరించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బెంగాల్లో హిం దువులపై దాడులకు పాల్పడుతున్న దుండగులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్‌లోని అబిడ్స్ సెంటర్లో నిరసన ప్రద ర్శన చేశారు.
వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీ యాలకు ప్రాధాన్యమిస్తూ ప్రజాస్వామ్యాన్ని సమా ధి చేయడం తగదన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై నిరసనల సాకుతో హిందువులపై జిహాదీలు హింసకు దిగుతున్నారని మండిపడ్డారు. కాశ్మీర్ తరహాలో హిందువుల ఊచకోత సాగుతోందని, కట్టుబట్టలతో తరిమివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా మమత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అనంతరం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ వినతిపత్రాన్ని రాష్ట్రపతికి పంపాలని కలెక్టర్‌ను కోరారు.