- కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దండ రాజిరెడ్డి
ములుగు, వెలుగు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఉద్యాన పంటలది కీలక పాత్ర అని వైస్ ఛాన్స్ లర్ దండ రాజిరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ పదో వ్యవస్థాపక దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్ లర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.... తెలంగాణలో 5.23 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయన్నారు.
కొత్తపంట రకాలను పరిచయం చేయగా అవి తెగుళ్లను తట్టుకోగలిగాయన్నారు. డాక్టర్ ఉమా శంకర్ సాగరం బయోలాజికల్ క్యాప్చర్ ఆఫ్ కార్బన్ ప్రాముఖ్యాన్ని వివరించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫౌండేషన్ గ్రాఫ్ డైరెక్టర్ ఎస్. కె మతూర్, రిజిస్టర్ భగవాన్ వర్సిటీ అధికారులు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, విజయ శ్రీనివాస్, చిన్న నాయక్, ప్రశాంత్, సైదయ్య, అనిత కుమారి, సుచిత్రతో పాటు తదితరులు పాల్గొన్నారు.