
- పూర్తి వివరాలతో రిపోర్ట్ సిద్ధం చేస్తున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), -సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య తలెత్తిన టికెట్ల వివాదంలో విజిలెన్స్ విచారణ ఇంకా కొనసాగుతున్నది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు
విజిలెన్స్ అధికారులు విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా శుక్రవారం కూడా ఉప్పల్ స్టేడియంలో సోదాలు జరిపారు.
అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో వివరాలు సేకరించారు. హెచ్‌సీఏ, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులు ఇప్పటికే అందించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరుపున్నారు. ప్రధానంగా ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, అగ్రిమెంట్లను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు, కాంప్లిమెంటరీ పాసుల వివరాలతో అధికారులు రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు.