![లైగర్ మూవీ ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ రెస్పాండ్.. ఇక పై నోర్మూసుకుని ఉంటా](https://static.v6velugu.com/uploads/2023/08/vijay-devarakonda-about-liger-movie-flop_R2praZTU5I.jpg)
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ఆపిల్ బ్యూటీ సమంత(Samantha) నటిస్తున్న చిత్రం ఖుషి(Khushi). ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ తన ఫ్యామిలి లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ ఈవెంట్ ను పలు నేషనల్ మీడియాలు కవరేజ్ చేయడంతో పాటుగా..విభిన్నమైన ప్రశ్నలు వేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఎంతో మెచ్యూర్డ్‌గా ఆన్సర్స్ ఇచ్చారు.
ఇక విజయ్ గత చిత్రం లైగర్(Liger) సినిమా ఫ్లాప్ గురించి ప్రశ్నలు వేయగా..విజయ్ రియాక్ట్ అవుతూ..లైగర్ మూవీ ఫ్లాప్ నన్ను బాధపెట్టింది కానీ భయపెట్టలేదు.ఈ ఇండస్ట్రీ జర్నీలో ఇవన్నీకామన్. ఫ్లాపులు,సక్సెస్‌లు వచ్చాయని ప్రయాణాన్ని ఆపలేం కదా? అన్నట్టుగా మాట్లాడారు విజయ్. ఇక తాను సైలెంట్‌గా నోర్మూసుకుని ఉంటానని..ఇది తనకు తాను వేసుకున్న శిక్ష అని, ఇక నా నుంచి రాబోయే మూడు సినిమాల వరకు ఇలానే ఉంటానని చెప్పారు.
నా వర్క్, నా ఎఫోర్ట్స్ ..నా సినిమాలు రూపంలో మాట్లాడుతాయని చెప్పుకొచ్చారు. అలాగే.. లైగర్ మూవీ ఫ్లాప్ అయిందని నాకు బాధలేదు.. ఇలాంటి ఫ్లాపులు కూడా రావాలి.. ఎందుకంటే.. నాకు ఇండస్ట్రీ లో ఎవ్వరూ చెప్పేవారు లేరు..నా డెసిషన్ నేనే తీసుకుంటాను..దాని వల్ల సక్సెస్ అయితే ఎంతో కొంత నేర్చుకుంటాను.. ఫెయిల్ అయినా నేర్చుకుంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది కామన్.. ఏ మనిషి కూడా ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉండడు.. ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి.. అంటూ ఇలా విజయ్ దేవరకొండ ఎంతో చక్కగా మాట్లాడుకుంటూ వచ్చారు.
దీంతో రౌడీ ఫ్యాన్స్.. విజయ్ ఆటిట్యూడ్ లో చాలా చేంజ్ వచ్చిందని అనుకుంటున్నారు. ఎందుకంటే, లైగర్ మూవీ స్టార్టింగ్ లోనే విజయ్ ఓవర్ కాన్ఫిడెన్స్ సినిమా ప్లాప్ కు మెయిన్ రీసన్ అని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇక లైగర్ మూవీ కలెక్షన్ల విషయంలో కూడా 200 కోట్ల మూవీ అంటూ చెప్పగా..భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది. దీంతో మూవీ రిలీజ్ అయ్యాక మీడియా ముందు సరిగా కనిపించలేదు విజయ్.
ఖుషి ట్రైలర్ పక్కా ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా ఉంది. యూత్ లవ్ అండ్ న్యూ మ్యారేజ్ మధ్య ఉండే గ్యాప్.. ప్రేమ పెళ్లి తర్వాత వచ్చే గొడవలతో ఈ ట్రైలర్ కు మంచి హైప్ వచ్చింది. ఇక ఇప్పటికే ఖుషి సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham abdul wahab) చాలా ఇంటెన్సివ్ మ్యూజిక్ ఇచ్చారు.
ALSO READ :Jailer Movie Review: రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్
శివ నిర్వాణ(Siva Nirvana) డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇక విజయ్ తన పన్నెండో సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
విజయ్ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే పేరును ఫైనల్ చేశారట టీమ్. దీనికి ట్యాగ్ లైన్‌గా కుటుంబరావు అని తెలుస్తోంది. ఈ మూవీకు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు.