Prabhas Kalki2898Ad: ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీలో విజ‌య్ దేవరకొండ!

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న కల్కి 2898 AD మూవీలో బిగ్ స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసేందే.సైన్స్ ఫిక్ష‌న్- ఫాంట‌సీ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటాని త‌దిత‌రులు కీ రోల్స్ లో న‌టిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

అయితే, ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మరో ఇద్దరు  స్టార్ హీరోస్ గెస్ట్ రోల్స్ ప్లే నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ అతిథి పాత్ర‌లో న‌టిస్తాడ‌ని వార్తలు వచ్చాయి.

దుల్కర్ కల్కి మూవీ షూటింగ్ స్పాట్ని విజిట్ చేశానని..డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఆలోచన విధానం..తన ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం,మహానటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ముందుకు వెళ్తున్నారు. కల్కి వంటి గ్రేట్ స్క్రిప్ట్ రాయాలంటే,  నాగ్ అశ్విన్ తప్ప మరెవరికి అలాంటి ఆలోచన రాదని వెల్లడించారు. దీంతో దుల్కర్ పాత్ర కన్ఫర్మ్ అయినట్లే అని సమాచారం. 
 
ఇపుడు ఇలాంటి సమయంలోనే స్టార్ హీరో రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా న‌టిస్తున్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కిలో విజయ్ నిడివి కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌న్న టాక్ ఉంది. రీసెంట్గా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..ప్రభాస్ క‌ల్కి ప్రాజెక్ట్ గురించి ఎంతో ఎగ్జ‌యిటెడ్ గా ఉన్నానంటూ ఆస‌క్తిని వ్య‌క్తం చేశాడు. 

అంతేకాకుండా..ఈ మూవీలో త‌న ఫేవ‌రెట్ స్టార్లంతా యాక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో న్విజయ్ దేవరకొండ కల్కి మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ నాగ్ అశ్విన్ మధ్య మంచి అనుబంధం ఉంది. సినిమాల్లోకి రాక ముందే నుంచే వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండటంతో వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. 

నాగ్ అశ్విన్లో డైరెక్షన్లో విజయ్ దేవరకొండ ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం లో గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మ‌హాన‌టి, జాతి ర‌త్నాలులోను గెస్ట్ రోల్ చేశాడు. దీంతో ప్రభాస్ కల్కి సినిమాలో మ‌రోసారి గెస్ట్ రోల్ లో విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

అయితే ఈ వార్త‌ల్ని కల్కి మేకర్స్ ఆఫీసియల్ గా ప్రకటించే వరకు ఫ్యాన్స్ వెయిట్ దేవరకొండ విజయ్ ఏదేమైనప్పటికీ చేయాల్సిందే. పాన్ వరల్డ్ సినిమా కల్కి లో భాగమవుతుండటం న్యూస్ వస్తున్న సమయంలో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.  

కల్కి 2898 AD మూవీ 2024 మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వీఎఫ్ ఎక్స్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయ‌ని స‌మాచారం. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రమోషన్స్ షురూ చేసేశాడు నాగ్ అశ్విన్.ఇక రానున్న రోజుల్లో అంత‌ర్జాతీయ సినిమా ఉత్స‌వాల్లో నాగ్ అశ్విన్ కల్కి సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నాడు.