
- వికారాబాద్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ఎల్ఆర్ఎస్ అంశాలపై మండల స్థాయి అధికారులతో బుధవారం వీసీ ద్వారా రివ్యూ చేశారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లీకేషన్లను రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులు పరిశీలన చేసి, ఉన్నతాధికారులకు అర్హుల జాబితా పంపాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అర్హులైన వారికి మార్కవుట్ ఇవ్వాలన్నారు. పేదలకు మహిళా సమాఖ్యల నుంచి అప్పు ఇప్పించాలని, బేస్మిట్ స్థాయి వరకు నిర్మించిన ఇండ్ల ఫొటోలు, రిపోర్టులను యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసం కోసం ఈ నెల 14 వరకు అప్లయ్ చేసుకోవచ్చని, 15 నుంచి వెరిఫీకేషన్ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్‌నాయక్, ఆర్డీవో వీణ, డీఎస్వో మల్లికార్జునబాబు తదితరులు పాల్గొన్నారు.