టీమిండియా క్రికెట్ లో రింకూ సింగ్ అతి తక్కువ మ్యాచ్ ల్లోనే తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన రింకూ.. భారత టీ20ల్లో స్థానం సంపాదించి నిలకడగా రాణిస్తున్నాడు. ఇదే క్రమంలోనూ వన్డేల్లో చోటు సంపాదించాడు. భవిష్యత్తులో భారత జట్టు ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ఈ యూపీ ఆటగాడికి టీమిండియా తరపున టెస్టులు ఆడే సత్తా కూడా ఉందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అభిప్రాయపడ్డాడు.
"నేను నెట్స్‌లో రింకు సింగ్ బ్యాటింగ్‌ను చూసినప్పుడు అతనిలో ఒక టెస్ట్ క్రికెటర్ ఉన్నాడని గమనించాను. టీ20 క్రికెట్ లో అతను అద్భుతమైన ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ మీరు అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ ను పరిశీలిస్తే యావరేజ్ 50 ఉంది. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. రింకూకు అవకాశామిస్తే గొప్ప టెస్ట్ క్రికెటర్ గా ఎదగుతాడు". అని రాథోర్ అన్నారు.
Also Read:-శ్రీలంక టూర్‌కు భారత్.. వన్డే జట్టులో శ్రేయాస్ రీ ఎంట్రీ..?
రింకు ఇప్పటివరకు భారత్ తరఫున రెండు వన్డేలు.. 20 టీ20 మ్యాచ్ లాడాడు. టీ20ల్లో 176.27 స్ట్రైక్ రేట్.. 83.2 సగటుతో 15 ఇన్నింగ్స్‌లలో 416 పరుగులు చేశాడు. 2009-10 రంజీ సీజన్ లో ఉత్తరప్రదేశ్ తరుపున పది ఇన్నింగ్స్ లు ఆడిన రింకు.. నాలుగు సెంచరీలు బాది 953 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 50 లిస్ట్ -ఏ మ్యాచ్ లు, 78 టీ20 మ్యాచ్ లు ఆడిని రింకు సింగ్.. 8 సెంజరీలు, 41 హాఫ్ సెంచరీలు చేసి 6,016 పరుగులు సాధించాడు.
Rinku for Tests?
— ESPNcricinfo (@ESPNcricinfo) July 15, 2024
👉 https://t.co/aK8nMl8yhO pic.twitter.com/o5tLpPrjxw