సత్యంపేటలో 20 రోజులుగా తాగు నీళ్లు బంద్ 

సత్యంపేటలో 20 రోజులుగా తాగు నీళ్లు బంద్ 

ములకలపల్లి, వెలుగు : మండలంలోని మాదారం గ్రామపంచాయతీ సత్యంపేట గ్రామంలో 20 రోజులుగా తాగు నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని డైరెక్ట్  పంపింగ్ బోర్​ మోటార్  రిపేర్ కు రావడంతో ఈ సమస్య వచ్చింది. మోటారు కాలిపోవడంతో పంచాయతీ సిబ్బంది దానిని బయటకు తీసి అలాగే  వదిలేశారు. అప్పటి నుంచి గ్రామ సమీపంలోని మిషన్ భగీరథ సంపు వద్ద లీకేజీ నీటిని బిందెలతో తెచ్చుకొని వాడుకుంటున్నారు. 

అధికారులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు సమస్య వివరించి పది రోజులు గడిచినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.